కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు

కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు

  • మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

క్యాతన్‌పల్లి , ఆంధ్రప్రభ: తెలంగాణ అస్తిత్వానికి, కేసీఆర్‌కు విడదీయలేని సంబంధం ఉందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులపై, ముఖ్యంగా కేసీఆర్‌ను విమర్శిస్తున్న వారిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేసీఆరే తెలంగాణ ఆత్మ: “తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు, తెలంగాణ లేనిదే మనం లేము” అని సుమన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినా ఏవీ నిలబడలేదని, ప్రజలందరికీ అసలు విషయం తెలుసని అన్నారు. కొత్తగా పార్టీలు పెట్టినంత మాత్రాన బీఆర్‌ఎస్ పార్టీకి గానీ, కేసీఆర్ ప్రతిష్టకు గానీ వచ్చే నష్టం ఏమీ లేదని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను ‘మరమనిషి’ అని విమర్శించే వారికి అసలు రాజకీయ అవగాహన ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే ముందు తమ స్థాయి ఏంటో గుర్తుంచుకోవాలని సూచించారు. రైతుబంధుతో రైతులకు దేవుడయ్యాడని, గొర్రెల పంపిణీతో యాదవులకు, చేప పిల్లల పెంపకంతో ముదిరాజులకు కేసీఆర్ న్యాయం చేశారని కొనియాడారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన నేతను విమర్శించడం సమంజసం కాదన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు బొమ్మ భూమయ్య గౌడ్, గ్యాస్ నాని, బబ్బెర స్వర్ణలత, వేనంక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అనిల్ రావు మరియు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply