Responsibilities | బాధ్యతల స్వీకారం..
Responsibilities | బాధ్యతల స్వీకారం..
- జన్నారం ఇన్చార్జి తహసీల్దారు నియామకం
Responsibilities | జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం ఇన్చార్జి తహసీల్దారుగా స్థానిక డిప్యూటీ తహసీల్దారు నేరెళ్ల రామ్మోహన్‌ను నియమించారు. ఈ రోజు మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఇంతకాలం పనిచేసిన తహసీల్దార్ చిట్ల రాజ మనోహర్ రెడ్డి(Chitla Raja Manohar Reddy) బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఇక్కడ డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న రామ్మోహన్ ను జన్నారం ఇన్చార్జి తహసీల్దారుగా నియమించారు.
ఈమేరకు ఆయన బాధ్యతలు(Responsibilities) స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరి సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉండి,ముఖ్యంగా రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తానని ఆయన చెప్పారు.
