అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
  • తెలంగాణ రాష్ట్ర అవతరణ జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్.

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాల్లో మంగళవారం వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సాధికారత లక్ష్యాలుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ నాయక్, స్థానిక కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply