పెట్రోల్ డీజిల్ సంక్షోభం..

పెట్రోల్ డీజిల్ సంక్షోభం..
కృతిమ కొరత సృష్టిస్తున్న కూటమి నేతలు…
బంకుల వద్ద నిరసన వ్యక్తం చేసిన
వైసీపీ ఎమ్మెల్సీ నాయకులు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ సంక్షోభం మొదలైందని, ఇది కచ్చితంగా కూటమి నేతలు సృష్టిస్తున్న కృతిమ కొరత అని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం పెట్రోల్ బంక్ వద్ద మాజీ శాసనసభ్యులు కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఇసాక్ బాష, వైసిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా రైతులకు కూడా డీజిల్ పెట్రోల్ దొరకని సమస్య మరింత తీవ్రమైందన్నారు.కూటమి ప్రభుత్వంలో కనీసం చలనం కనిపించడం లేదని విమర్శించారు.

రాష్ట్రంలో 4510 పెట్రోల్ బంకులు ఉండగా 79 శాతం వాటిలో నో స్టాక్ బోర్డులు పెట్టారని తెలిపారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కర్ణాటక తెలంగాణలలో ఎక్కడా పెట్రోల్ డీజిల్కు కొరతలేదని, ఎటువంటి సరఫరాలో సంక్షోభం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ కొరతపై వైఎస్ఆర్సిపి ఎంపీలు కేంద్ర మంత్రులను సంప్రదిస్తే సరఫరా లో ఎక్కడ లోటు లేదని పెట్రోల్ బంక్ లో నుంచి ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారని పేర్కొన్నారు.
అయితే ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు ఏర్పడిందని,అందుకు కారణం ఎవరు అన్నది కూటమి ప్రభుత్వ నేతలు చేర్చాల్సి ఉందన్నారు. పెట్రోల్ డీజిల్ కొరత వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తుందని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నాబాబు చౌదరి, రాష్ట్ర మహిళ విభాగం సెక్రటరీ శశికల రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, అధికార ప్రతినిధి అనిల్అమృతరాజ్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు కారురవి కుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడుటివి రమణ, జిల్లా సెక్రటరీ లు దేవనగర్ భాషా, శివ నాగిరెడ్డి, జలీల్, బాబు తదితరులు పాల్గొన్నారు.
