RTC BUS | 15మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం..
RTC BUS | 15మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం..
RTC BUS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మెదక్‌లోని కొల్చారం జాతీయ రహదారిపై ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన వారితో పాటు మొత్తం 15 మంది క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
