నవ దంపతులకు ఎమ్మెల్యే సుజనా పెళ్లి కానుక
నవ దంపతులకు ఎమ్మెల్యే సుజనా పెళ్లి కానుక
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, తన నియోజకవర్గ పరిధిలోని నూతన దంపతుల కోసం సుజనా పెళ్లి కానుక అందజేస్తున్నారు.ఆహ్వాన పత్రికను ఆయనకు పంపిన వారికి వధువుకు చీర, వరుడు కి ప్యాంటు-షర్ట్ స్వీట్ బాక్స్ తో పాటు పసుపు కుంకుమలు కానుకగా అందిస్తున్నారు.
41వ డివిజన్ దర్గా ప్రాంతానికి చెందిన షేక్ సిద్ధిఖా, రహమతుల్లా (లేటు ) దంపతుల కుమార్తె షేక్ నూర్జహాన్, షేక్ నాగూర వివాహం గురువారం భవానిపురం దర్గా ప్రాంతంలోని వారి నివాసం నందు జరిగింది.ఈ వివాహ వేడుకలో ఎమ్మెల్యే కార్యాలయం తరపున సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొని నూతన వధూవరులకు సుజనా పెళ్లి కానుక అందజేసి కొత్త జంటసుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు..
