Kammarpally విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
Kammarpally విషాదం.. రోడ్డు ప్రమాదంలోయువకుడి దుర్మరణం
కమ్మర్‌పల్లి (Kammarpally), ఆంధ్రప్రభ: మండలంలోని కోనా సమందర్ గ్రామంలో గురువారం ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాడే చరణ్ (18) స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి లాడే అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కమ్మర్‌పల్లి ఎస్సై సి.హెచ్. సతీష్ తెలిపారు.
