Singareni Dorli-2 Mine Closure Success | గని మూసివేతలో సింగరేణి సంచలనం.. రూ.40 కోట్ల రీఫండ్‌తో అద్భుత విజయ గాథ
Singareni Dorli-2 Mine Closure Success | గని మూసివేతలో సింగరేణి సంచలనం.. రూ.40 కోట్ల రీఫండ్‌తో అద్భుత విజయ గాథ
Singareni Dorli-2 Mine Closure Success | హైదరాబాద్, ఆంధ్రప్రభ: బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా, గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణా లను పాటిస్తున్న సంస్థగా Singareni Collieries Company Limited మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 ఓపెన్కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభసమయంలో డిపాజిట్ చేసిన సుమారు రూ.40 కోట్ల సొమ్మును వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్(Coal Controller Organization) సింగరేణికి తిరిగి చెల్లించింది. గనుల ప్రారంభం నుంచి మూసివేత వరకు అమలు చేయాల్సిన మైన్ క్లోజర్ ప్లాన్, పర్యావరణ పరిరక్షణ చర్యలు, భూసంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలు తదితర అంశాలను సింగరేణి సంస్థ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కచ్చితంగా అమలు చేసింది. డోర్లీ-2 గని మూసివేత ప్రక్రియలో సింగరేణి చూపిన బాధ్యతాయుత వైఖరి, పర్యావరణ హిత చర్యలు, పారదర్శకత ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. గనుల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సుస్థిర మైనింగ్ విధానాలను అమలు చేస్తున్న సింగరేణి సంస్థకు ఇది మరో విశిష్ట గుర్తింపుగా భావిస్తున్నారు.
ల్సిన పర్యావరణహిత చర్యలు, గని మూసివేత నాటికి చేపట్టవలసిన ఇతర చర్యలపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ అయిన కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ కొన్ని నియమ నిబంధనలను సూచిస్తుంది. ఈ నిబంధనలను సంబంధిత కంపెనీ కచ్చితంగా అమలు చేయాలి. దీనికోసం ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి అంత మొత్తాన్ని కంపెనీ నుంచి ముందస్తు జాగ్రత్తగా ఒక డిపాజిట్ రూపంలో తీసుకుంటారు. కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్తోతో పాటు, బొగ్గు గని యాజమాన్యం, బ్యాంకర్లు కలిసి ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకొని సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. గని జీవితకాలం పూర్తయిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం గని యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు పర్యావరణ హిత చర్యలు పూర్తి చేసినట్లయితే ఆ డిపాజిట్ను వడ్డీతో సహా తిరిగి గని యాజమాన్యానికి చెల్లిస్తుంటారు.
బెల్లంపల్లిలో డోర్లీ ఓపెన్ కాస్ట్-2 గని
ఇదేవిధంగా సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాలో డోర్లీ ఓపెన్ కాస్ట్-2 గనికి 2013-14లో అనుమతులు పొందింది. నిబంధనల ప్రకారం గని ప్రారంభం నుంచి చివరి వరకు తాను చేపట్టనున్న పర్యావరణ హిత చర్యలకు సంబంధించి అంచనా వ్య యం సుమారు రూ. 26.79 కోట్లను కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద డిపాజిట్ చేసింది. ఈ గని ఏడు సంవత్సరాలు పాటు బొగ్గును ఉత్పత్తి చేసిన తర్వాత 2023-24 లో మూసివేశారు. పనులు ఇచ్చిన హామీ ప్రకారం కొత్తగా ఏదైనా గనిని ప్రారంభిస్తున్నప్పుడు ఆ గని జీవితకాలంలో అమలు జరపా పూర్తయిందీ లేనిదీ ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజ…
డిపాజిట్ ఏమిటి? ఎప్పుడు తిరిగి చెల్లిస్తారు?
సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబూర్ (పశ్చిమబెంగాల్) ద్వారా 2024 జూలైలో తనిఖీ నిర్వహించారు. ఆడిట్లో అన్ని సక్రమంగా జరిగాయని సింగరేణి సంస్థ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఏడేళ్ల క్రితం డిపాజిట్ చేసిన సొమ్మును వడ్డీతో సహా కలిపి తిరిగి సింగరేణి సంస్థకు చెల్లిస్తున్నట్లు డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాష్ శివ హరే తమ లేఖలో ఇటీవల పేర్కొన్నారు. మొత్తం 40 కోట్లు చెల్లించాల్సి ఉండగా దీనిలో 90 శాతం డిపాజిట్ సొమ్ము 36.63 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని, మిగిలిన పది శాతం జస్ట్ ట్రాన్సిషన్ ప్రొవిజన్స్ అంశాలు పరిశీలించిన తర్వాత చెల్లిస్తామని పేర్కొన్నారు. అంటే దాదాపు 40 కోట్ల రూపాయలు తిరిగి సింగరేణి సంస్థ ఖాతాలో పడుతున్నాయి.
