డాక్టర్ రమేష్‌కు సన్మానం
డాక్టర్ రమేష్‌కు సన్మానం
తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ కు ఎమ్మెల్యే కూలికపూడి శ్రీనివాసరావు సన్మానం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాంతీయ వైద్యశాలలో సర్జన్‌గా సేవలందిస్తున్న రమేష్ తిరువూరు ఎంవీఎస్ హాస్పిటల్ వైద్యులుగా వైద్య రంగంలో ఈ ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను ఆయన ఇటీవల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ జాతీయ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ కిన్నెర మొగిలయ్య, డాక్టర్ సాజిదా ఖాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన కార్యాలయంలో రమేష్ ను దుష్యాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
