నిబంధనలు మీరితే జైలుకే….. అర్జున్
నిబంధనలు మీరితే జైలుకే….. అర్జున్
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతమ్మ ఆలయానికి వచ్చే భక్తులు వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు చేపడతానని స్థానిక ఎస్సై అర్జున్ హెచ్చరించారు. గురువారం రాత్రి గ్రామాల్లో మాసం విక్రయిస్తూ మాసంలో నరికే పలువురికి స్థానిక పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇటీవల మాసం నరికే క్రమంలో భక్తులకు వ్యాపారులకు జరిగిన గొడవల వల్ల మరల ఎలాంటి సంఘటనలు పునరావతం కాకుండా మాంసం నరికే పలువురు వ్యాపారులకు ఎస్సై పలు సూచనలు చేశారు. పోలీసు వారు సూచించిన నిబంధన ప్రకారమే వ్యాపారాలు తమ వ్యాపారాలను కొనసాగించుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తానని హెచ్చరించారు.
