ఎస్సై నుంచి ఎస్పీగా.. రామోజీ రమేష్‌..!

ఎస్సై నుంచి ఎస్పీగా.. రామోజీ రమేష్‌..!

  • కష్టపడే తత్వం, క్రమశిక్షణతో సాధించిన ఉన్నతి
  • పోలీస్‌ సేవ నుంచి మహోన్నత సేవా పతకాలు పొందిన అధికారిగా గుర్తింపు
  • పోలీస్‌ శాఖలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరిన అధికారి
  • రెండు తెలుగు రాష్ట్రాలలో పలు కీలక ప్రాంతాల్లో సమర్థ సేవలు
  • యువ పోలీసు అధికారులకు స్ఫూర్తిగా నిలిచిన కెరీర్‌ ప్రయాణం
  • ఎస్పీగా ప్రమోషన్‌పై శుభాకాంక్షల వెల్లువ
  • అంకితభావంతో ప్రారంభమైన ఉద్యోగం

ఖమ్మం, ఆంధ్రప్రభ:
సాధారణ ఎస్సైగా పోలీసు శాఖలో 1989 బ్యాచ్‌కు చెందిన డిపార్టుమెంట్‌లో అడుగుపెట్టి తన కృషి, క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధతతో ఎస్పీ స్థాయికి ఎదిగిన రామోజీ రమేష్‌ ప్రయాణం పోలీసు శాఖలో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఉద్యోగ జీవిత ప్రారంభం నుంచే ప్రజల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ, శాఖలో ప్రత్యేక గుర్తింపు పొందారు. విధి పట్ల అంకితభావంతో పని చేయడం ఆయన ఎదుగుదలకు బాటలు వేసిందని సహచరులు పేర్కొంటున్నారు.

అంచెలంచెలుగా ఉన్నత హోదాలకు

1989లో ఎస్‌ఐగా ఎస్సైగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో సేవలు ప్రారంభించిన ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత కాలం పని చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర, దమ్మపేట, మణుగూరు, అశ్వారావుపేట, చింతూరు ప్రాంతాలలో పని చేశారు. అనంతరం రామోజీ రమేష్‌ తన ప్రతిభ, పనితీరుతో సీఐగా 2014లో పదోన్నతి పొందారు. సీఐగా పదోన్నతి పొందిన అనంతరం ఖమ్మం ట్రాఫిక్‌, ఖమ్మం రూరల్‌, ఇతర ప్రాంతాల్లో పని చేశారు. 2014లో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఖమ్మం రూరల్‌, ఖమ్మం ట్రాఫిక్‌ తదితర ప్రాంతాల్లో ఏసీపీగా సేవలందించారు.

అనంతరం హైదరాబాద్‌లో ఏసీపీగా పని చేశారు. 2023లో అడిషనల్‌ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం భూపాలపల్లి జిల్లా అడిషనల్‌ ఎస్పీగా విధులు నిర్వహించారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ ఎస్పీగా నల్గొండ జిల్లాలో పని చేశారు. అనంతరం నల్గొండ జిల్లా పీటీసీలో పని చేశారు. అనంతరం రీజనల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. పలు కీలక విభాగాల్లో సమర్థవంతంగా పనిచేశారు. ప్రతి బాధ్యతను సవాలుగా స్వీకరిస్తూ ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే శాఖలో ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకున్నారు.

ఇంటెలిజెన్స్‌ విభాగంలో ప్రత్యేక గుర్తింపు

ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇం-టె-లిజెన్స్‌ విభాగంలో రీజనల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించిన రామోజీ రమేష్‌ విశ్లేషణాత్మక దృక్పథం, పరిస్థితులను ముందుగానే అంచనా వేసే సామర్థంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. రాష్ట్ర భద్రతకు సంబంధించిన అంశాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ శాఖకు విలువైన సేవలు అందించారు. అనంతరం 2026లో ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది విధులు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రామోజీ రమేష్‌ సేవలు

పోలీస్‌ శాఖలో 1989 బ్యాచ్‌ ఎస్‌ఐగా విధులు ప్రారంభించిన రామోజీ రమేష్‌ తెలంగాణలో పలు కీలక ప్రాంతాల్లో విధులు నిర్వహించిన ఆయన తెలంగాణతో పాటు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ విభాగంలో ఆరు సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతంలో పని చేశారు. అత్యంత కీలకమైన కేసుల్లో సైతం తన సమర్ధతను నిరూపించుకొని పని చేశారనే గుర్తింపు ఆయనకు పోలీస్‌శాఖలో ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో సేవలందించిన గుర్తింపు పొందారు.

తెలంగాణ వ్యాప్తంగా సేవల ముద్ర

తెలంగాణలోని పలు ప్రధాన నగరాలు, కీలక ప్రాంతాల్లో విధులు నిర్వహించిన రామోజీ రమేష్‌ ప్రజలతో మమేకమయ్యే అధికారి అనే పేరును సంపాదించారు. ప్రజల సమస్యలను ఓర్పుగా వింటూ, సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తూ సమర్థ పరిపాలన అందించారు. క్రమశిక్షణతో పాటు- మానవీయ కోణంలో వ్యవహరించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.

స్ఫూర్తిదాయకంగా ఎస్పీ పదోన్నతి

ఇటీ-వల ఎస్పీగా పదోన్నతి పొందిన రామోజీ రమేష్‌కు వివిధ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడే తత్వం, నిజాయితీ, అంకితభావం ఉంటే ఎంతటి ఉన్నత స్థాయి-కై-నా చేరుకోవచ్చని ఆయన ప్రస్థానం నిరూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. యువ పోలీసు అధికారులకు ఆయన కెరీర్‌ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంటు-న్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో ఎక్కువ అనుబంధం

1989లో తొలి పోస్టింగ్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన ఆయన ఎస్‌ఐగా విధుల్లో చేరిన తొలినాళ్ళలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పని చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్‌, మధిర, దమ్మపేట, మణుగూరు, అశ్వారావుపేట, చింతూరు తదితర ప్రాంతాల్లో ఎస్‌ఐగా, సీఐగా, ఏసీపీగా, అడిషనల్‌ ఎస్పీగా విధులు నిర్వహించటం ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దీర్ఘకాలిక సేవలందించినట్లు పలువురు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎస్పీగా సైతం ప్రస్తుత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పని చేస్తున్న ఆయనకు ఉద్యోగోన్నతి లభించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉన్నట్లు పలువురు పేర్కొన్నారు.

ఖమ్మం నగరంలో ట్రాఫిక్‌ విభాగంలో సీఐగా, ఏసీపీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఆయన నగరంలోని ప్రధాన ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషి చేశారని ఖమ్మం ప్రజల నుంచి మన్ననలు పొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పని చేసిన సమయంలో ఎన్నో క్లిష్టతరమైన కేసులను ఛేదించిన కితాబు ఆయనకు శాంతిభద్రతలు పరిరక్షించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మనసులు గెలుచుకున్నారు. అధికారిగా పని చేస్తూ ప్రజలకు చేరువై పోలీస్‌ ఠానాకు వచ్చిన ప్రతి సమస్యను వేగవంతంగా పరిష్కారం చూపించిన అధికారిగా గుర్తింపు ఉంది.

సేవ నుంచి మహోన్నత సేవ పతకాలు పొందిన అధికారిగా గుర్తింపు

పోలీస్‌శాఖలో విధులు నిర్వహణ, సమర్ధవంతంగా కేసులు ఛేదించిన అధికారులకు, అత్యంత క్లిష్ట పరిస్థితులలో, విపత్తుల సమయంలో ప్రజలకు సేవలందించినందుకు గాను పోలీస్‌శాఖలో వివిధ సేవా పతకాలు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో రామోజీ రమేష్‌కు 2000 సంవత్సరంలో రాష్ట్ర పోలీస్‌ సేవా పతకం పొందారు. అనంతరం 2008లో పోలీస్‌ ఉత్తమ సేవా పతకం పొందారు. అనంతరం 2023లో రాష్ట్ర పోలీస్‌ మహోన్నత పతకం సైతం పొందిన సమర్ధవంతమైన అధికారిగా ఆయనకు పోలీస్‌శాఖలో విలువైన గుర్తింపు ఉంది.

Leave a Reply