టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత…
టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత…
నవాబుపేటలో అంత్యక్రియలకు నేతల రాక
కుటుంబానికి నెట్టెం రఘురాం పరామర్శ
పార్టీకి తీరని లోటని నివాళి
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సొసైటీ చైర్మన్ చింతా వెంకటేశ్వరరావు (బుల్లి) శనివారం అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన మృతి వార్త పార్టీ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం నియోజకవర్గ నాయకులతో కలిసి నవాబుపేటలోని బుల్లి నివాసానికి చేరుకుని, భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ బుల్లి పార్టీకి అంకితభావంతో సేవలు అందించిన నాయకుడని, గ్రామాభివృద్ధి, పార్టీ బలోపేతానికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని భావోద్వేగంగా తెలిపారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ క్లిష్ట సమయంలో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చింతల సీతారామయ్య, జగ్గయ్యపేట మండల అధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, కొఠారి ప్రసాద్, నంబూరి వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
