మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సి అందజేత..

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సి అందజేత..

వానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ ను గురువారం ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, కేదారేశ్వరపేట బీజేపీ మండల అధ్యక్షుడు రుద్రపాటి వెంకటేష్ తో కలిసి అందజేశారు.34 వ డివిజన్, ఆర్ సి యం చర్చ్ ప్రాంతంలో నివాసముంటున్న కే తనిష్క్ మూత్రనాళ సమస్య (హైపోస్పాడియాస్‌)తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆ చిన్నారికి మరింత మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2 లక్షల 54 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేయడంతో చిన్నారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు..