400points | లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ…
400points | లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ…
400points | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో తుది ఒప్పందం దిశగా ముందుకు వెళ్తున్నామని, హోర్ముజ్‌లో ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు సానుకూల సంకేతాలిచ్చింది. డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
గత సెషన్ ముగింపు 77,017తో పోలిస్తే బుధవారం ఉదయం సుమారు 400 పాయింట్ల లాభంతో ప్రారంభమైన BSE Sensex 77,424 వద్ద ఓపెన్ అయింది. తర్వాత కొంత లాభాలను కోల్పోయినా ఉదయం 10 గంటల సమయంలో 313 పాయింట్ల లాభంతో 77,331 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు Nifty 50 కూడా 117 పాయింట్ల లాభంతో 24,150 వద్ద కొనసాగుతోంది.
మార్కెట్లో కోఫోర్జ్, ఫోర్స్ మోటార్స్, ఎస్ఆర్ఎఫ్, యెస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ వంటి షేర్లు లాభాల్లో ఉండగా, లార్సన్, హిటాచీ ఎనర్జీ, యునైటెడ్ స్పిరిట్స్, బ్లూ స్టార్, సీజీ పవర్ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 607 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 638 పాయింట్లు లాభాలతో ట్రేడింగ్ జరుపుతున్నాయి.
