అరుణాచల్ ప్రదేశ్ కేడర్ కు మార్పు
(గూడూరు, ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర మీనా (Raghavendra Meena) ను అరుణాచల్ ప్రదేశ్ -గోవా-మి జోరం -కేంద్రపాలిత ప్రాంతాలు (ఏజీఎంయూటీ) కేడర్ కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఏజీఎంయూటీ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి సులేఖా జగర్వార్ (Sulekha Jagarwar) ను వివాహం చేసుకున్నారు.
మీనా విజ్ఞప్తి మేరకు, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ అనుమతితో బదిలీ చేసినట్టు సిబ్బంది వ్యవహారాలశాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గూడూరు సబ్ కలెక్టర్ గా రాఘవేంద్ర మీనా గత ఏడాది గూడూరు సబ్ కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా రిలీవ్ కానున్నారు.

