తిరుపతమ్మ ఆలయ అన్నప్రసాదానికి ఎస్సై అర్జున్ విరాళం
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ ఓపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాదానికి స్థానిక ఎస్సై అర్జున్ తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా రూ.10,000 విరాళంగా అందజేశారు.
ఈ విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ రాజు చేతుల మీదుగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఎస్సై అర్జున్ను ఆశీర్వదించి, అమ్మవారి ప్రసాదాన్ని జ్ఞాపకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది నిమ్మగడ్డ గంగ తదితరులు పాల్గొన్నారు.
