పదవి లేకుండానే అభివృద్ధి ముద్ర…
3వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గుమాల్ మమత శ్రీనివాసులుకు ప్రజలు బ్రహ్మరథం
మహబూబ్ నగర్, ఫిబ్రవరి (ఆంధ్రప్రభ):
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గుమాల్ మమత శ్రీనివాసులు అధికార పదవి లేకున్నా ప్రజాసేవను ప్రాధాన్యంగా తీసుకొని అభివృద్ధికి నాంది పలికారు. డివిజన్ పరిధిలో తన సొంత నిధులతో చేపట్టిన అనేక మౌలిక సదుపాయాల పనులు ప్రజల మనసులు గెలుచుకున్నాయి. అప్పన్నపల్లి బ్రిడ్జి చివరన, కారుకొండ సంజీవ్ ఇంటి సమీపంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు క్రాంతినగర్ కాలనీలో రోడ్డు మధ్యలో ఉన్న కాలువలపై మూడు కల్వర్టులు, అప్పన్నపల్లిలో ఇబ్బందికర రోడ్లపై నాలుగు కల్వర్టులు నిర్మించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు.
అలాగే 3వ డివిజన్లోని ప్రతి కాలనీలో JCB, డోజర్ల ద్వారా ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. సొంత నిధులతో 150 ట్రిప్పుల మట్టిని వినియోగించి మట్టి రోడ్ల అభివృద్ధి చేపట్టారు. అప్పన్నపల్లిలో యాదవ కాలనీ CC రోడ్డు దెబ్బతినకుండా మట్టి వేయించడంతో పాటు బృందావన్, క్రాంతినగర్ కాలనీల్లో వర్షాకాలంలో ఏర్పడ్డ గుంతలను మట్టి వేసి పూర్చి రాకపోకలకు ఆటంకం లేకుండా చేశారు. క్రాంతినగర్‌లో మట్టి రోడ్లను డోజర్ ద్వారా చదును చేసి రోడ్డు పనులు పూర్తి చేయగా, అప్పన్నపల్లిలో సింగనమొని వారి గల్లిలో నిల్వ ఉన్న వర్షపు నీటిని డ్రైనేజీ కాలువకు మళ్లించారు. పోలెమోని శ్రీను ఇంటి సమీపంలో గల గుంతలను కూడా పూర్చి ప్రజలకు ఊరట కల్పించారు.
అప్పన్నపల్లి, బృందావన్, క్రాంతినగర్, యాదవ కాలనీల్లో మట్టి రోడ్లపై ఉన్న గుంతలను JCB, డోజర్లతో చదును చేసి రోడ్లను మెరుగుపరిచిన మమత శ్రీనివాసులు సేవలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. అధికారంలోకి వస్తే డివిజన్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న నమ్మకంతో ప్రజలు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థికి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఎలాగైనా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గుమాల్ మమత శ్రీనివాసులు గెలిపించుకొని తమ కాలనీనీ మరింత అభివృద్ధి చేసుకోవడంతో పాటు గుమాల్ శ్రీనివాసులు రుణం తీర్చుకుంటామనీ ప్రజలంటున్నారు.
