349 kg | రూ.1,745 కోట్ల మాదకద్రవ్యాలు సీజ్

349 kg | రూ.1,745 కోట్ల మాదకద్రవ్యాలు సీజ్

349 kg | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను నార్కోటిక్స్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1,745 కోట్ల విలువైన 349 కిలోల కొకైన్‌ను సీజ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. చిన్న ఆధారాన్ని ఆధారంగా చేసుకుని అధికారులు అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించగలిగారని ఆయన తెలిపారు.

నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. భారీగా కొకైన్ పట్టుబడడంతో ముంబయిలో డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర సంస్థలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.