3వేల ట్రిప్పుల ఇసుక డంపులు సీజ్

3వేల ట్రిప్పుల ఇసుక డంపులు సీజ్

ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణంలోని గోదావరి నది తీరాన నిలువ చేసిన ఇసుక డంపులను ధర్మపురి తహసిల్దార్ ఎరుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గోదావరి తీరాన డంపులను స్వాధీనం చేసుకున్నారు.

సుమారు 3 ట్రిప్పుల ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు తహసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు. మండలంలో ఎక్కడ ఇసుక డంపులు ఉన్నా వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కరరావు, జిపిఓ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply