ఎల్ఓసీ పత్రం అందజేత
ఎల్ఓసీ పత్రం అందజేత
బెజ్జంకి, ఆంధ్రప్రభ: బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర రాజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 1,25,000 విలువైన ఎల్ఓసీ పత్రాన్ని బాధితుడు రాజుకు అందజేశారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఈ సహాయం అందించడంలో సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు రాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
