KNR | వసతి గృహాలకు పూర్తిస్థాయి వసతులు కల్పించాలి : జాయింట్ సెక్రెటరీ శ్యాంప్రసాద్ లాల్

కరీంనగర్, ఆంధ్రప్రభ : వసతి గృహాలు ప్రారంభమయ్యే నాటికి పూర్తి స్థాయిలో వసతుల కల్పన ఉండాలని మహాత్మ జ్యోతిబాపూలే జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు. ఈరోజు (గురువారం) కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వసతులతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

వంటగది, వసతి గృహ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే యూనిఫార్మ్స్ ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వసతి గృహాలను నడుపుతుందన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించమని, నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.

Leave a Reply