Breaking | హెచ్ సీయూ భూములపై నివేదిక ఇవ్వండి… హైకోర్టుకు సుప్రీం ఆదేశం

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ భూములను యదాతదంగా ఉంచాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల వాస్తవిక పరిస్థితుల పై వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తక్షణమే ఈ భూములను న్యాయ నిపుణులతో పరిశీలించి ఈ మధ్యాహ్నం 3.30గంటలకు మధ్యంతర నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. కాగా, ఈ కేసు విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వని నేపథ్యంలో సుప్రీంకోర్టు తాను ఆదేశాలు ఇచ్చేంత వరకు ఆ భూముల్లో చెట్లు నరకవద్దని తెలంగాణ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *