23aprileditorial | ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ

23aprileditorial | ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ

23aprileditorial | ఇరాన్–అమెరికా చర్చలు వాయిదా: కారణాలేమిటి?
హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు
ఆంక్షలు, దిగ్బంధనలు: వ్యూహాల పోరు
నౌకల కదలికలు, ఆర్థిక ప్రభావం
భారత్‌కు చెందిన నౌకలపై ఘటన, పెరుగుతున్న టెన్షన్
చర్చలపై అనుమానాలు, భవిష్యత్తు పరిస్థితి

23aprileditorial | ఇరాన్‌–అమెరికాల మధ్య చర్చలు, ఇరాన్‌ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో అమెరికా తరఫున పాల్గొనాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పర్యటన కూడా వాయిదా పడినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై ఇరువర్గాల నుంచి ఇంకా స్పష్టత లేదు.

మరోవైపు హార్మూజ్‌ జలసంధిలో ఒక కంటైనర్‌ నౌకపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దళాలు కాల్పులు జరిపాయి. యూకేకు చెందిన మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. కాల్పులు జరిపిన విషయాన్ని ఇరాన్‌ కూడా అంగీకరించింది. ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితిలో ఇరాన్‌ రాయబారి సయీద్‌ ఇరవానీ మాట్లాడుతూ, చర్చలకు తమ దేశం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, అమెరికా ముందస్తుగా షరతులు విధించడం చర్చలకు ఆటంకంగా మారిందని అన్నారు. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాలన్న అమెరికా షరతుపై స్పందిస్తూ, అది తమ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయంమని స్పష్టం చేశారు. అలాగే, తమ నౌకలను అమెరికా దిగ్బంధించడం కాల్పుల విరమణ ఉల్లంఘనగా పేర్కొన్నారు.

23aprileditorial
23aprileditorial

ఇదిలా ఉండగా, హార్మూజ్‌ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని అమెరికా ప్రకటించింది. తుది ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని తెలిపింది. అయినప్పటికీ, అమెరికా దిగ్బంధనాన్ని దాటుకుని ఇరాన్‌కు చెందిన 34 నౌకలు హార్మూజ్‌ జలసంధిని దాటినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, అమెరికా ఆంక్షలను లెక్కచేయకుండా డజన్ల కొద్దీ నౌకలు ప్రయాణం కొనసాగిస్తున్నాయి.

గల్ఫ్‌ నుంచి 19 నౌకలు బయటకు వెళ్లగా, 15 నౌకలు గల్ఫ్‌లోకి ప్రవేశించాయి. వీటి ద్వారా ఇరాన్‌కు సుమారు 910 మిలియన్‌ డాలర్ల ఆదాయం లభించినట్లు అంచనా. అమెరికా నిఘాను తప్పించుకోవడానికి ఇరాన్‌ నౌకలు ఆధునిక పద్ధతులను వినియోగిస్తున్నాయి. ‘డొరేనా’ అనే సూపర్‌ ట్యాంకర్‌ తన ఉనికిని గుర్తించకుండా ఉండేందుకు ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించినట్లు సమాచారం. మరోవైపు, ఇరాన్‌ నౌకలను గుర్తించేందుకు అమెరికా కూడా ఆధునిక పద్ధతులను వినియోగిస్తోంది. మొత్తంగా, చమురు నౌకల రాకపోకల విషయంలో ఇరుదేశాలు పరస్పరం కన్నుగప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల భారత్‌కు చెందిన రెండు నౌకలపై ఇరాన్‌ కాల్పులు జరపడం ఉద్రిక్తతను పెంచింది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఇరాన్‌ అధికారులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు, హార్మూజ్‌ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ట్రంప్‌ ప్రకటించగా, అదే జలసంధి తమ నియంత్రణలో ఉందని ఇరాన్‌ కూడా ప్రకటించింది. జలసంధిలో ప్రవేశించే ప్రతి నౌక రివల్యూషనరీ గార్డ్స్‌ అనుమతి తీసుకోవాలని ఇరాన్‌ స్పష్టం చేసింది.

ఇరాన్‌, అమెరికా రెండూ చర్చలకు సిద్ధమేనని ప్రకటిస్తున్నప్పటికీ, ఒకవైపు పరోక్షంగా తమ నౌకలను హార్మూజ్‌ జలసంధి దాటించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులను పరిశీలిస్తే, చర్చల పట్ల ఇరుదేశాలకు పూర్తి స్థాయి చిత్తశుద్ధి ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

click here to read more

click here to read సర్కారీ బడుల్లో విద్యా విప్లవం

Leave a Reply