స్నేహితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మున్సిపల్ కేంద్రంలోని విశ్వభా రతి ఉన్నత పాఠశాల 2006- 2007 బ్యాచ్ పదవతరగతి పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితురాలు మమ్మద్ బిపాషా భర్త రహీం అకాల మృతి చెందడంతో ఆ కుటుంబానికి రూ. 40 వేలు ఆర్థిక సాయంగా అందించారు.
తమతోపాటు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన స్నేహితురాలు భర్తను కోల్పోవడంతో మినహా స్నేహితులందరూ కలిసి వారి కుటుంబాన్ని ఓదార్చి సహాయం చేయడం పట్ల పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో విశ్వ భారతి పూర్వ ఉపాధ్యాయుడు బయ్యని రాజు,విద్యార్థులు తొట్ల నరేష్, కంసాని రాజిరెడ్డి , అంబటి శ్రీకాంత్, వనం మహేష్ , శ్రీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, పరశురాములు ,దండవేణి, మంజుల , గంగుల ప్రియాంక, నిలిగొండ భాగ్యలక్ష్మి, వంగ సంధ్య, మామిడి ఉష, హేమలత , స్వప్న, లోడంగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
