2026Elections | ఒక్క‌సారే.. చాన్స్‌!

2026Elections | ఒక్క‌సారే.. చాన్స్‌!

2026Elections | తంబీల రూటే వేర‌ప్పా
ప్ర‌తిసారి ప్ర‌భుత్వ మార్పే త‌మిళ ఓట‌ర్ల‌ ల‌క్ష్యం
ఎంజీఆర్, జ‌య‌ల‌లిత‌పై మాత్రం క‌రుణ
నాడు క‌రుణానిధి.. నేడు స్టాలిన్ ఓట‌మి

2026Elections | చెన్నై, ఆంధ్ర‌ప్ర‌భ : తమిళనాడులో ఒక సంప్రదాయం ఉంది. ఒకసారి అధికారం ఇచ్చిన పార్టీని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించడం త‌మిళ తంబీల‌కు అలవాటు. అది 1967లో డీఎంకే తొలిసారి అధికారం చేపట్టినప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం. దానికి బ్రేక్ వేసిన వారు ఇద్దరే ఇద్దరు. వారే ఎంజీఆర్, జయలలిత.

తమిళనాడులో కాంగ్రెస్ నెట్టి ద్రవిడ పార్టీలు 1967లో తొలిసారిగా అధికారంలోకి వచ్చాయి. తొలి సీఎం అన్నాదురై రెండేళ్లు పాలన చేశాక మరణించారు. దాంతో డీఎంకే నుంచి కరుణానిధి 1969లో తొలిసారి సీఎం అయ్యారు. ఆయన హయాంలో తొలిసారి 1972లో ఎన్నికలకు వెళ్తే జనాలు పట్టం కట్టారు. ఆ సమయంలో ఆయన వెంట తమిళుల సినీ ఆరాధ్య దైవం ఎంజీఆర్ ఉన్నారు. కరుణానిధి విజయానికి పూర్తి సాయం చేశారు. ఎందుకంటే అప్పటికి ఎంజీఆర్ కూడా డీఎంకే నాయకుడే. ఆ త‌ర్వాత‌ అభిప్రాయ భేదాలు రావడంతో ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు.

వరుసగా విజయం..

1977లో తొలిసారిగా అన్నా డీఎంకే ఎంజీఆర్ నాయకత్వంలో తమిళనాడులో గెలిచింది. అయితే.. 1980లో ఎంజీఆర్ ప్రభుత్వాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం కూల్చివేసి రాష్ట్రపతి పాలన పెట్టింది. ఆ తరువాత 1980లో జరిగిన ఎన్నికల్లో తిరిగి 1984లో జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ వరుసగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తంగా చూస్తే ఎంజీఆర్ మూడు సార్లు ప్రజల నుంచి వరుసగా సక్సెస్‌లను అందుకుని ప్రభుత్వాన్ని స్థాపించారు. ఆ త‌ర్వాత‌ జయలలిత కూడా 2011, 2016లో వరుసగా రెండు సార్లు గెలిచారు. ఇంతకు మించి తమిళనాట మరే పార్టీ.. మరే నాయకుడూ వరుసగా గెలిచిన సందర్భాలు లేవు.

కరుణానిధి సైతం..
1969లో తొలిసారి సీఎం అయి అప్పట్లో ఏడేళ్లు, ఆ త‌ర్వాత‌ 1989నుంచి రెండేళ్లు, 1996, 2006లో మరో పదేళ్లు కలుపుకుని మొత్తం పద్దెనిమిదేళ్ల‌ పాటు కరుణానిధి తమిళనాడుని ఏలారు. కానీ, ఆయన వరుసగా రెండోసారి గెలిచింది లేదు. ఆ ఫీట్‌ని 2011లో సాధించాలనుకున్నా కుదరలేదు. ఇక.. 2021లో తొలిసారి డీఎంకే తరఫున సీఎం అయిన స్టాలిన్ 2026లో మరోసారి గెలిసి తమ పార్టీ మీద ఉన్న యాంటీ సెంటిమెంట్‌కి బ్రేక్ వేయాలనుకున్నారు. ఈసారి త్రిముఖ పోరు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతుందని, తాను కచ్చితంగా గెలుస్తానని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. మొత్తం మీద ద్వితీయ గండాన్ని స్టాలిన్ గట్టెక్కలేకపోయారు.

రాజ‌కీయ సంచ‌ల‌న‌మే..

ఇక‌.. ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీచేసిన ప్రతి చోటా డిపాజిట్.. విజయ్ మార్కు సంచలనం.. తాము అమితంగా ఆరాధించే నాయకులకు మినహాయింపు తప్ప తమిళనాడు ఓటర్లు మాత్రం ఒకసారి గెలిపిస్తే మరోసారి ఓడిస్తారు. ఇది అక్కడి సంప్రదాయం. దానికి రాజకీయ చైతన్యం అని పేరుపెట్టినా లేక మార్పు కోసం అయిదేళ్ల‌కు ఒకసారి తీర్పు ఇస్తారని భావించినా తప్పు లేదు. కానీ తమిళనాడు ఓటర్లు మాత్రం ఎవరినీ క్షమించరు. ఈ విషయంలో అధికారం అందుకోబోతున్న విజయ్ టీవీకే పార్టీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందని పొలిటిక‌ల్ అన‌లిస్టులు అంటున్నారు.