2026 Minab Mystery : ఇదొక సజీవ మిస్టరీ Andhra Prabha Top Story

2026 Minab Mystery : ఇదొక సజీవ మిస్టరీ Andhra Prabha Top Story
- పాఠశాలపై దాడి…
- 156 మంది మృతి
- ఒక్క బాలుడు మాయం
- తల్లిదండ్రుల ఆవేదన
- ఆశలతో ఎదురుచూపులు
- 38 రోజులకు దొరికిన బూటు
- డీఎన్ఏ పరీక్షల్లోనూ క్లూ లేదు
- ఇది అంతర్జాతీయ వివాదం
- యుద్ధ నేరాల ఆరోపణలు
- ఐక్యరాజ్యసమితి స్పందన
- మిజరబుల్ మిస్టరీగా ఈ చిన్నారి మకాన్ కథ
( ఆంధ్రప్రభ; టెహ్రాన్ ప్రతినిధి)

ప్రపంచంలోని ఎన్నో మిస్టరీలు.. ఏ మిస్టరీకి చావు ఉండదు. అందుకే ప్రపంచంలో ఈ జాబితాకూ అంతూ పొంతూ ఉండదు. ఏళ్లకు ఏళ్లు గడిచినా.. ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. తాజాగా… అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ఎథికే ప్యూరీ.. యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అదే ఇరాన్ లో ఓ ప్రాథమిక పాఠశాలపై బాంబులు కురిపించి.. 156 మందిని సమాధి చేసిన ఈ ఆపరేషన్ లో.. ఒకే ఒక బాలుడు మిస్ అయ్యాడు. అతడు ప్రాణాలతో ఉన్నాడో లేదో.. ఈ సాంకేతిక పరిజ్ఞనానికి అంతు చిక్కటం లేదు. తాజాగా.. ఈ మిజరబుల్ మిస్టరీ.. ప్రపంచ చరిత్రలో.. టాప్ పేజీలోకి చేరింది.
2026 Minab Mystery : అది నరమేధం
అది 2026 ఫిబ్రవరి 28. శనివారం ఉదయం. ఇరాన్ కాలమానం ప్రకారం 10.40 గంటలకు మినాబ్‌లోని షజరే తయ్యాబే ప్రాథమిక పాఠశాల కళకళలాడుతోంది. సుమారు 264 మంది విద్యార్థులు, టీచర్లు, పాఠశాల సిబ్బంది.. ఎవరు పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. మరో ఐదు నిముషాల్లో.. ఆకాశంలో విమానం మోత.. బాంబుల మోత,, ఒక్కసారిగా చిన్నారుల గావుకేక.. ఆఖరి చావుకేకగా మారిసపోయింది. పాఠశాల భవనం కుప్పకూలింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు మార్మోగిపోయాయి.
2026 Minab Mystery : అమ్మానాన్నల ఆక్రందన

పరిసర ప్రాంతాల్లోని పెద్దలు.. తల్లి దండ్రులు, యువజనం ఉరుకులు పరుగులతో స్కూలుకు చేరుకున్నారు. లోనికి వెళ్లలేని స్థితి. అగ్నికీలల్లో అప్పటికే కబాబ్ స్మెల్ ఆవరించింది. (మంటల్లో మాంసపు ముద్దలు). తమ పిల్లలు బతికారో.. మరణించారో తెలియని స్థితిలో.. తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రాణాలొడ్డి క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చారు. మరుచటి రోజుకు నిప్పుల బూడిదలో.. పొగచూరిన గదుల్లో సగం కాలిన శవాలు.. బొగ్గుల్లా..మృతదేహాలు కనిపించాయి. అంతే అమ్మానాన్నల గుండెలు పగిలిపపోయాయి. ఈ విగత జీవుల్లో తమ బిడ్డలెవరో.. గుర్తించే పనిలో. అల్లాడిపోయారు. ఇందులో 120 చిన్నారుల కళేబరాలు.. 26 మంది టీచర్లు, ఏడుగురు తల్లిదండ్రులు, బస్సు డ్రైవరు, క్లీనిక్ టెక్నీషియన్ సహా 156 మంది మరణించారని మినాబ్ జనరల్ ప్రాసిక్యూటర్ ధృవీకరించారు. వీరిలో 120 మంది విద్యార్థులు (73 మంది బాలురు, 47 మంది బాలికలు). 26 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నట్టు అధికారులు లెక్కతేల్చారు. సుమారు 96 మంది ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను గుర్తించే పనిలో ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు, దాదాపు అందరి మృతదేహాలను, శరీర భాగాలను గుర్తించి పరీక్షల తరువాత ఆయా కుటుంబాలకు అప్పగించారు. కానీ ఆ పాఠశాల మృతుల్లో ఓ చిన్నారి ఆనవాళ్లు దొరకలేదు. అతడు చనిపోయాడా? బతికే ఉన్నాడో? నిర్ధారణ కాలేదు. కడకు అతడి మరణమే .. ఓ సజీవ మిస్టరీగా మారింది.
2026 Minab Mystery : ప్చ్ … మకాన్ మాయం

అతడే,,, మకాన్ నసిరి. ఏడేళ్ల బుడ్డోడు అతడి బర్త్‌డే ఫిబ్రవరి 28. అదే రోజు ఉదయం స్కూలుకు వెళ్తూ.. టాటా చెబుతూ అమ్మా ఫోటో తీయ్… అంటూ స్యూలుకు వెళ్లాడు. స్యూలుపై బాంబు దాడి సమాచారంతో అమ్మానాన్న అక్కడకు పరుగులు తీశారు. తమ బిడ్డ జాడ లేదు. ఆ రోజు నుంచి … ఈ రోజు ఏప్రిల్ 28 వరకూ ఆచూకీ లేదు. మకాన్ నసిరి తండ్రి సైరస్ నసిరి. తల్లి ఆసియే రహీనెజాద్ . వీరిది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. మకాన్ నసిరి ఒకే ఒక కొడుకు. స్థానిక మత కేంద్రంలో అసిస్టెంట్ గా మకాన్ తండ్రి పని చేస్తున్నాడు. మకాన్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు. 156 మృతదేహాల్లో మకాన్ నసిరి బాడీ దొరకలేదు. కనీసం ప్రాణాలతో ఉన్నాడనే గంపెడాశతో ..అమ్మానాన్నే కాదు.. కుటుంబ సభ్యులందరూ వెతికారు. కానీ జాడలేదు. కనీసం చహల్లామ్ రోజున బిడ్డకు నివాళి అర్పించే అవకాశం కోసం తల్లిదండ్రి తపించిపోయారు. సరీగా 38వ రోజున…
2026 Minab Mystery : బూటు దొరికిందోచ్

బాంబు దాడిలో చిధ్రమైన ప్రధాన పాఠశాల భవనానికి సుమారు 100 మీటర్ల దూరంలోని ఒక తోటలోని పొదల్లో దొరికాయి. దాడి తీవ్రతతో అవి అంత దూరంలో పడిపోయినట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలిలో దొరికిన అనేక శరీర భాగాలను, ఈ వస్తువులను విస్తృతంగా పరీక్షించారు. డీఎన్ఏ టెస్టులు జరిపారు. మకాన్ శరీరంలోని ఒక్క అణువు జాడ లభించలేదు, బాంబు విస్ఫోటనంతో అధిక ఉష్ణోగ్రత, అతి తీవ్రత వల్లే అతడి శరీరం పూర్తిగా కానరాని రీతిలో తునాతునకలైనట్టు.. ఫొరెన్సిక్ నిపుణులు ప్రాయపడుతున్నారు.ఈ దాడులు జరిగిన 38 రోజుల తర్వాత మకాన్ మామ (uncle) హమ్జే రహీనెజాద్ ఈ షూని, ఆ పొదల్లో నీలి రంగు స్వెట్టర్ పీలికలను గుర్తించారు.ప్రస్తుత ఈ స్వెటర్ , షూ ను ఒక మసీదులో ఒక గాజు పెట్టెలో భద్రపరిచారు. , మకాన్ జ్ఞాపకార్థం ఉంచారు.
2026 Minab Mystery : ఔను మిజరబుల్ మిస్టరీ

ప్రపంచంలో లెక్కలేని అంతుచిక్కని మిస్టరీలు… జనం గుండెల్ని పిండేస్తుంటాయి. అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎథిక్ ప్యూరి సాక్షిగా.. మకాన్ ససిరి మరణం కూడా మిజరబుల్ మిస్టరీగా మారింది. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం ఓర్చుకోలేకపోతోంది ఆ బిడ్డ అమ్మానాన్నను ఓదార్చలేని దుర్బలస్థితిలో.. మకాన్ మరణం ఓ మిజరబుల్ మిస్టరీగా ప్రపంచం భావిస్తోంది. ఈ ఘోర ఖలి ఒక సజీవ మిస్టరీగా మారింది. అంతర్జాతీయ వివాదంగా మారింది. 2026 ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని మినాబ్ (Minab) నగరంలోని షజరే తయ్యాబే ప్రాథమిక పాఠశాలపై వైమానిక దాడుల్లో ఈ చిన్నారి అదృశ్యం…మిస్టరీ కావటంతో,. ఈ దాడిని అమెరికా-ఇజ్రాయెల్ హత్యాకాండగా, యుద్ధ నేరంగా ఇరాన్ ఆరోపిస్తోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం కూడా ఈ మరణాలపై విచారణకు ఒత్తిడి చేస్తోంది. మిస్టరీలు గతాన్ని ప్రశ్నిస్తుంటే, సజీవ మిస్టరీలు “వర్తమాన సాంకేతికతను” సవాలు చేస్తున్నాయి. మకాన్ నసిరి విషయంలో ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ALSO READ : 2026 Us Iran War : ఆపసోపాలు Andhra Prabha Top Story
