తల్లిపాలే శిశువుకు శ్రేష్ఠమైన ఆహారం
కడెం, ఆంధ్రప్రభ: తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన శ్రేష్ఠమైన ఆహారమని పెద్దూర్ గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం కడెం మండలంలోని పెద్దూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఆయన పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని, తల్లిపాలు శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ప్రభుత్వం మంజూరు చేసిన దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు కత్తెరపాక రాజశేఖర్, అంగన్వాడీ టీచర్ జాడి రాజేశ్వరి, హెల్పర్ అంజలి, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
