2026 Us Iran War : ఆపసోపాలు Andhra Prabha Top Story

2026 Us Iran War : ఆపసోపాలు Andhra Prabha Top Story

  • మే 1 డెడ్‌లైన్‌
  • రాజకీయ సంక్షోభం
  • కాంగ్రెస్ వర్సెస్ ట్రంప్
  • సెనేట్‌లో ఓటింగ్‌
  • డెమోక్రాట్ల ఒత్తిడి
  • ఇరాన్-రష్యా అనుబంధం
  • అమెరికా ఆందోళన
  • అటు అణు చర్చల మెలిక
  • ఇటు హోర్ముజ్ సంక్షోభం
  • ట్రంప్ ఉక్కిరి బిక్కిరి
  • పైచేయి ఎవరిది?..
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

2026 Us Iran War

అమెరికాలో రిబపబ్లికన్ల రాజకీయ స్థితి.. అగమ్య గోచరంగా మారుతోంది. ప్రపంచశాంచిన్న చిన్న దేశాలపై అశ్వమేధ యాగం ప్రారంభించిన శేత్ సౌధం అధినేత .. అదే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ రాజకీయ భవితవ్యం ఇరకాటంలో పడింది. మరో నాలుగు మాసాల్లో అమెరికాలో మధ్యతర ఎన్నికలు సమీపిస్తుంటే.. ఇక్కడ యుద్ధ విరమణకు ఇరాన్​ .. చిక్కటం లేదు. దొరకటం లేదు. మధ్యవర్తుల తంత్రాంగం .. ఒక అడుగు ముందుకు.. నాలుగు గజాలు వెనక్కి పడుతున్నాయి. తక్షణం యుద్ధాన్ని విరమించాలి. ఇదే డోనాల్డ్​ ట్రంప్​ ప్రధాన లక్ష్యం. ఇందుకు ఇరాన్​ తో టామ్​ అండ్​ జెర్రీ గేమ్​ లో ట్రంప్​ అల్లాడిపోతున్నారు. ఇక యుద్ధం కొనసాగింపునకు.. కాంగ్రెస్​ బ్రేక్​ నుంచి ఎలా తప్పించుకోవాలో .. అర్థం కాక… డైరెక్టుగా మాతోనే మాట్లాడవచ్చు.. కనీసం ఫోన్​ లో రాజీ పడొచ్చు అంటూ ట్రంప్​.. ఇరాన్​ వైపు దీనంగా చూసే పరిస్థితి దాపురించింది. మరో వైపు అమెరికాకు ఎవరంటే.. పడదో.. ఆదేశాలతోనే.. అదే చైనా గ్యారేజీ..రష్యా ఖజానా మాటను ఇరాన్​ తప్పటం లేదు. ఈ స్థితిలో.. అనవసర ఆపరేఫన్​ స్టార్ట్​ చేసి.. అనివార్య రాజీమార్గంలో..అమెరికా ఆపసోపాలు పడటానికి కారణాలేంటీ ?

2026 Us Iran War : మే 1 డెడ్​ లైన్​

2026 Us Iran War

ఇరాన్‌తో శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, ఇరాన్‌పై యుద్ధ గమనాన్ని నిర్దేశించగల ఒక దేశీయ గడువును ట్రంప్ ఎదుర్కొంటున్నారు. 1973 యుద్ధ అధికారాల తీర్మానం ప్రకారం, సైనిక కార్యకలాపాలను కొనసాగించడానికి అమెరికా అధ్యక్షుడికి మే 1 వరకు కాంగ్రెస్ ఆమోదం పొందేందుకు గడువు ఉంటుంది, లేదా చట్టప్రకారం వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ అధికారాన్ని మంజూరు చేయడానికి, ప్రతినిధుల సభ సెనేట్ రెండూ తమ తమ సభలలో సాధారణ మెజారిటీతో ఒక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించాలి. ఇప్పటి వరకు, అలా జరగలేదు.

2026 Us Iran War : మరో 30 రోజులు చాన్స్​

2026 Us Iran War

కొలరాడో లా స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ మరియం జంషిది మాట్లాడుతూ, 60 రోజుల గడువును మరో 30 రోజులు పొడిగించాలంటే, “తప్పనిసరి సైనిక అవసరం” కారణంగానేసాయుధ దళాల కొనసాగింపు జరుగుతోందని అధ్యక్షుడు కాంగ్రెస్‌కు లిఖితపూర్వకంగా ధృవీకరించాలని అన్నారు. “ఈ 90 [రోజుల] గడువు దాటిన తర్వాత, యుద్ధం ప్రకటించకపోయినా లేదా సైనిక చర్యను కొనసాగించడానికి మరే విధంగానైనా అధికారంకాంగ్రెస్ ఇవ్వకపోయినా, అధ్యక్షుడు అమెరికా సాయుధ దళాల మోహరింపును నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ యుద్ధం రద్దు నిబంధనను పాటించేలా అధ్యక్షుడిని బలవంతం చేయడానికి కాంగ్రెస్‌కు చట్టపర మార్గం ఏదీ లేదు, నిజానికి, యుద్ధ అధికారాల తీర్మానంలోని ఈ భాగం రాజ్యాంగ విరుద్ధం, అంటూనే గత అధ్యక్షులు కూడా అలా చేయడానికి నిరాకరించారు.

2026 Us Iran War : ఓటింగ్​ కు సెనేట్ల ఒత్తిడి

2026 Us Iran War

యుద్ధ అధికారాల తీర్మానంపై సెనేట్‌లో ఆరవసారి ఓటింగ్ జరిపించాలని అమెరికా డెమోక్రాట్లు ఒత్తిడి చేస్తున్నారు ఇరాన్‌పై “ఇష్టానుసార యుద్ధాన్ని” అరికట్టడమే లక్ష్యంగా, ఈ వారం అమెరికా సెనేట్‌లో యుద్ధ అధికారాల తీర్మానంపై ఆరవసారి ఓటింగ్ జరిపించాలని డెమోక్రాట్లు ఒత్తిడి చేస్తారని మైనారిటీ నాయకుడు చక్ షూమర్ ప్రకటించారు.ఈ బాధ్యతారహిత , ప్రజాదరణ లేని యుద్ధం మొదలై 60 రోజులు గడుస్తున్న తరుణంలో, రిపబ్లికన్లు ట్రంప్‌కు మద్దతు ఇస్తూ తమను తాము ఈ గోతిలో మరింత లోతుగా కూరుకుపోతారా? అని షూమర్ తన ఎక్స్​ ఖాతాలో రాశారు:”

2026 Us Iran War : వార్​ అధికారం ,.. కాంగ్రెస్​ దే

2026 Us Iran War

అమెరికా రాజ్యాంగం ప్రకారం, యుద్ధాన్ని ప్రకటించే అధికారం కాంగ్రెస్‌కు ఉంది, అధ్యక్షుడికి కాదు. ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలని, సైనిక చర్యలు ప్రారంభించే ముందు చట్టసభ సభ్యుల అనుమతి తీసుకోవాలని ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావడానికి సెనేట్ ప్రతినిధుల సభ రెండింటిలోనూ పదేపదే ప్రయత్నించి డెమోక్రాట్లు విఫలమయ్యారు.

2026 Us Iran War : ఇరాన్​ హ్యాపీ హ్యాపీ

2026 Us Iran War

తీవ్ర అనిశ్చితిలో “ఈ ప్రాంతం ఉన్నందున, రష్యాతో అత్యున్నత స్థాయిలో చర్చలు జరపడం పట్ల సంతోషంగా ఉన్నానని” ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి అన్నారు. రష్యాతో ఉన్నత స్థాయి చర్చల అనంతరం ‘వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ అరాఘ్చి ప్రశంసించారు “ఇటీవలి ఘటనలు మన వ్యూహాత్మక భాగస్వామ్యం లోతును, బలాన్ని స్పష్టం చేశాయి,” అని అరాఘ్చి Xలో రాశారు. “మన సంబంధం , బలపడుతున్న తరుణంలో, సంఘీభావానికి కృతజ్ఞులం, దౌత్యానికి రష్యా అందిస్తున్న మద్దతును స్వాగతిస్తున్నాం అని అరాఘ్చి అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, చర్చలను పునఃప్రారంభించాలని అమెరికా అభ్యర్థనను పరిశీలిస్తున్నట్టు ఇరాన్​ తెలిపింది, .

2026 Us Iran War : అమెరికా తర్జన భర్జన

2026 Us Iran War

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జాతీయ భద్రతా బృందం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేస్తూ, యుద్ధాన్ని నిలిపివేసి హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ శాంతి ప్రణాళికను సమీక్షిస్తోంది. హోర్ముజ్ జలసంధిని “తక్షణమే తిరిగి తెరవాలని” డజన్ల కొద్దీ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ జలమార్గంలో అమెరికా-ఇరాన్ ప్రతిష్టంభన ప్రపంచ ఆహార అత్యవసర పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి అధిపతి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. ఏప్రిల్ 17న “కాల్పుల విరమణ” జరిగినప్పటి నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 40 పైగా మృతి చెందారు. ఇస్పటికీ ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
తాజాగా ఇరాన్ ప్రతిపాదనతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘అసంతృప్తిగా’ ఉన్నారని అమెరికా మీడియా పేర్కొంది

2026 Us Iran War : ఇరాన్​ మెలికతో ఉక్కిరి బిక్కిరి

2026 Us Iran War

యుద్ధం ముగిసే వరకు ఇరాన్​ అణు కార్యక్రమంపై చర్చను పక్కన పెట్టాలని ఇరాన్​ ప్రతిపాదించిన ప్రణాళికపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారని అమెరికా మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. అణు సమస్యను ప్రారంభం దశలోనే పరిష్కరించాలని అమెరికా కోరుకుంటున్నందున ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారని మీడియా చెబుతోంది. ఇరాన్ ప్రతిపాదనతో తాను సంతృప్తిగా లేనని ట్రంప్ తన సలహాదారులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనను అంగీకరించే అవకాశం లేదని, అణు కార్యక్రమాన్ని పరిష్కరించకుండా ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే “చర్చలలో అమెరికా కీలక బలాన్ని కోల్సోతుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

2026 Us Iran War : పైచేయి ఎవరిది?

2026 Us Iran War

యుద్ధం రాజీ చర్చల్లో తమదే పైచేయి అని అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండూ తమకు తామే భుజాలు చరచుకొంటున్నాయి. కానీ అసలు అధికారం ఎవరి చేతిలో ఉంది? అనేది తేటతెల్లం కావటం లేదు. దిగ్బంధనం ఫలితంగా పెరిగిన ఇంధన ధరలతో బాధపడుతున్న డజన్ల కొద్దీ దేశాల మద్దతుతో బహ్రెయిన్ ఈ సమావేశాన్ని పిలిచింది. జలసంధిని మూసివేయడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆ దేశాలు పేర్కొన్నాయి. నౌకలపై దాడులను, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. భద్రతా మండలి ఎటువంటి చర్య తీసుకోలేదు. జలసంధిని తిరిగి తెరవాలని పిలుపునిచ్చిన గత తీర్మానాన్ని చైనా, రష్యా అడ్డుకున్నాయి. ఈ సమస్యకు మూలం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేసిన కారణం లేని దాడి అని రష్యా ఆరోపించింది.

2026 Us Iran War : వీడని ఆర్థిక సంక్షోభం

2026 Us Iran War

ఇరాన్‌పై యుద్ధం కీలక ఇంధనం సరఫరాకు అంతరాయం కలిగించి, సర్క్యూట్ బోర్డుల ధరలను పెంచింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు, దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (పీసీబీ) ధరలను పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ ఆరంభంలో సౌదీ అరేబియాలోని జుబేల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై ఇరాన్ జరిపిన దాడి ప్రధాన కారణం. పీసీబీ లామినేట్‌ల తయారీలో ఉపయోగించే కీలక బేస్ మెటీరియల్ పాలీఫెనిలీన్ ఈథర్ (పీపీఈ) రెసిన్ ఉత్పత్తిని నిలిపివేసింది. జుబేల్ కాంప్లెక్స్‌లో సౌదీ రసాయన తయారీ సంస్థ సాబిక్ (SABIC), ప్రపంచంలోనే మేటి పీపీఈ సరఫరాలో సుమారు 70 శాతం వాటాను కలిగి ఉంది. ఈ దాడి జరిగినప్పటి నుంచి ఆ సంస్థ ఉత్పత్తిని పునఃప్రారంభించలేదు. ఈ స్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఈ మెటీరియల్ లభ్యతలో తీవ్ర కొరత ఏర్పడింది. మార్చి నెలతో పోలిస్తే కేవలం ఏప్రిల్ నెలలోనే, పీసీబీ ధరలు ఏకంగా 40 శాతం పెరిగాయని, గోల్డ్‌మన్ సాక్స్ ప్రకటించింది

ALSO READ : 2026 Us Shooting News : గన్ డ్రామా Andhra Prabha Top Story

Leave a Reply