2026 jan | దావోస్ వేదికపై తెలుగు సీఎంల హవా | పెట్టుబడులు, ఎంవోయూలతో రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యం

2026 jan | వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ సదస్సు ప్రాధాన్యత
దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విశేషాలు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం
దావోస్ వేదికపై చురుగ్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించే రంగాలు
దావోస్‌లో కుదిరిన ఎంవోయూల వివరాలు
ఎంవోయూల వల్ల తెలంగాణ, ఏపీకి కలిగే ప్రయోజనాలు
తెలుగు రాష్ట్రాలకు దావోస్ పర్యటనల ప్రాముఖ్యత
2026 jan | దావోస్ వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
పెట్టుబడులు, ఎంవోయూలు, రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా…
2026 jan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రపంచ ఆర్థిక వేదిక..వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుండి ఆయా దేశ, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు, వివిధ దేశాల నుండి పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు, ఆర్థిక రంగ నిపుణులు ఈ వేదికపై కలుసుకుంటారు. అనేక రంగా;అ భవిష్యత్ ఆర్థిక దిశను నిర్ణయించే కీలక సమావేశం, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు.
ప్రతిష్టాత్మకమైన ఈ వేదికపై ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి, తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యం అనే స్పష్టమైన సందేశాన్ని పలురంగాల ప్రతినిధులకు, వివిధ దేశ, రాష్ట్ర అధినేతలకు ఇవ్వగలిగారు.
ఐటీ, ఫార్మా, బయోటెక్, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాలపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదే క్రమంలో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పాలసీ సపోర్ట్, మౌలిక సదుపాయాల గురించి వివరంగా తెలియజేనారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ఏఐ, డీప్‌టెక్, ఫార్మా ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను దావోస్ వేదికపై పారిశ్రామిక దిగ్గజాలకు వివరించడంతో పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది.

మరోవైపు, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులను రాష్ట్రం వైపు ఆకర్షించడంలో మూడు దశాబ్దాలుగ ముఖ్యమంత్రిగా పనిచేసిన, అంతర్జాతీయ అనుభవం ఉన్న నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి దావోస్ వేదికపై చురుకుగా వ్యవహరించడం ఊహించినదే. గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ పటంపై నిలబెట్టిన తన అనుభవాన్ని చంద్రబాబు గుర్తు చేస్తూ, ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను “నెక్స్ ట్ గ్రోత్ ఇంజిన్ ”గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ప్రకటించడం ఏపీవాసులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
చంద్రబాబు పర్యటనలో ప్రధానంగా, పరిశ్రమలు, పోర్ట్ ఆధారిత అభివృద్ధి గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, డిజిటల్ ఎకానమీ, మాన్యుఫాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ రంగాలు పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించారు. “ఏపీని గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో భాగం చేయడమే లక్ష్యం” అని ఆయన స్పష్టంగా చెప్పారు.
దావోస్ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంవోయూలు కుదుర్చుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ కుదుర్చుకున్న ఎంవోయూల విషయానికొస్తే, ఐటీ & డేటా సెంటర్ కంపెనీలతో భారీ పెట్టుబడుల ఒప్పందాలు ఫార్మా, బయోటెక్ రంగాల్లో రీసెర్చ్ & మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, గ్రీన్ ఎనర్జీ, సస్టెయినబుల్ టెక్నాలజీ ప్రాజెక్టులు, స్కిల్ డెవలప్‌మెంట్ & ఉద్యోగ కల్పనకు సంబంధించిన ఒప్పందాలు.
ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న ఎంవోయూలు:
గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు
పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్స్
ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ అనుబంధ పరిశ్రమలు
ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి-బేస్డ్ ఇండస్ట్రీస్
ఈ ఎంవోయూల ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఎంవోయూలు కేవలం ఒప్పంద పత్రాలే కాదు…
అవి భవిష్యత్ అభివృద్ధికి బాటలు కీలక ఒప్పందాలు.
వాటివల్ల ముఖ్య ప్రయోజనాలు: భారీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది.
వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రాలకు ఆర్థికంగా బలం చేకూరుతుంది.
ఉద్యోగావకాశాల సృష్టి జరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అంటే, సాంక్కేతిక మార్పిడి..అంతర్జాతీయ సంస్థల ద్వారా ఆధునిక సాంకేతికత తెలుగు రాష్ట్రాలకు చేరుతుంది. అంతేకాక స్థానిక పరిశ్రమలు బలోపేతమవుతాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు వస్తాయి. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది.
పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ప్రపంచ పెట్టుబడిదారుల మ్యాప్‌లో మరింత బలంగా నిలుస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతాయి.
దావోస్ పర్యటనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భవిష్యత్ అభివృద్ధికి వేసిన పునాదులు. రేవంత్ రెడ్డి తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుండగా, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ & గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎంవోయూలు మాటల్లోనే కాకుండా కార్యరూపం దాలిస్తే, రాబోయే దశాబ్దంలో తెలుగు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రమే మారే అవకాశం ఉందని చెప్పవచ్చు.
click here to read 2026 High | కొండ కాస్తా పర్వతమై..రికార్డు స్థాయికి వెండి ధరలు..
