Mahesh Kumar Goud | ఎన్నికల కోసమే బీజేపీ మత రాజకీయాలు
Mahesh Kumar Goud | ఎన్నికల కోసమే బీజేపీ మత రాజకీయాలు
కాంగ్రెస్ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధం
Mahesh Kumar Goud | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ నేత ఎన్.రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దేశంలోని పేదల కోసం ఏం చేసిందో వివరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించిన మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణలో అలాంటి రాజకీయాలకు ప్రజలు అవకాశం ఇవ్వబోరని వ్యాఖ్యానించారు.
