భవిష్యత్ తరాల కోసం ఇప్పుడే చర్యలు..

పర్యావరణ పరిరక్షణపై అధికారుల పిలుపు!

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఏఎంఓ విజయపాల్ రెడ్డి, సీఎంఓ రమేష్, 99 డేస్ యాక్షన్ ప్లాన్ జిల్లా నోడల్ అధికారి శ్రీకాంత్, జిల్లా సైన్స్ అధికారి స్వామి గోడ పత్రికలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ద్వారా ప్రకృతిని కాపాడగలమని పేర్కొంటూ, ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, ప్రశాంత్, అసిస్టెంట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply