ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఎమ్మెల్యే గద్దె రామమోహన్

పటమట, ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్‌లో బుధవారం నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ వెంటనే పరిశీలించుకోవాలని సూచించారు. పేరు లేకపోతే నమోదు చేయించుకోవడం, పేరు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవడం, మరణించిన లేదా చిరునామా మారిన ఓటర్ల వివరాలను బీఎల్‌వోలకు అందజేయాలని కోరారు.

మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఇంటింటికీ వచ్చే బీఎల్‌వోలకు ప్రజలు పూర్తి సహకారం అందించి లోపాల్లేని ఓటరు జాబితా రూపొందించేందుకు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.