10వ వర్డ్ అభివృద్ధి కోసం జుట్ల సంగీత సాగర్ ను గెలిపించండి

10వ వర్డ్ అభివృద్ధి కోసం జుట్ల సంగీత సాగర్ ను గెలిపించండి

ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
10వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిక మద్దతుగా ఓటు అడుగుతున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా 10వ వార్డు నుండి పోటీ చేస్తున్న జుట్ల సంగీత సాగర్ ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. జుట్ల సంగీత సాగర్ కు మద్దతుగా సోమవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం 10వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకుని బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు .ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 10వ వార్డు అభివృద్ధి కోసం ఒక విజన్ తో మీ ముందు నిలిచిన జుట్ల సంగీత సాగర్ ను ఆదరించి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ అమలు చేయలేదన్నారు .ఉచిత బస్ తప్పా మరే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లోను ప్రజలను మోసగించడం తప్ప అభివృద్ధి చేయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా అభివృద్ధి చేయడం చేతకాదని వారి ఆస్తులు మాత్రం పెంచుకోవడం మాత్రం పక్క అవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులను నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన మక్తల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఉన్నత విద్యావంతురాలైన 10వ వార్డు అభ్యర్థి పరిధిలో నెలకొన్న సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి వారి వద్ద ఒక విజన్ ఉందని గుర్తు చేశారు .ఆ విజన్ తో 10వ వార్డును ఆదర్శప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పారు. అందుకే ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి 10వ వార్డు కౌన్సిలర్ గా జుట్ల సంగీత సాగర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .అదేవిధంగా మిగతా వార్డుల్లోనూ బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పి. నరసింహ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు చిన్న హన్మంతు, జె.సాగర్ ,పారేవుల ఆశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.