H1b-Visa-Fee-Cancelled : భారత యువతకు భారీ ఊరట Andhra Prabha Top Story

H1b-Visa-Fee-Cancelled : భారత యువతకు భారీ ఊరట Andhra Prabha Top Story

  • H-1B వీసా ఫీజుకు బ్రేక్​
  • లక్ష డాలర్ల రద్దు
  • ఫెడరల్​ కోర్టు సంచలన తీర్పు
  • అప్పీల్​ కు వైట్​ హౌస్​ యత్నం
  • అప్పటి వరకూ.. ట్రంప్​ వడ్డన లేనట్టే
  • దేశవ్యాప్తంగా ఫీజు రద్దుకు ఆదేశాలు
  • భారత ఐటీ యువతకు భారీ ఊరట
  • మధ్యస్థాయి కంపెనీలకు కొత్త ఆశలు

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

H1b-Visa-Fee-Cancelled

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ కు మరో షాక్​ తప్పలేదు. H-1B వీసా దరఖాస్తులపై విధించిన 1,00,000 డాలర్ల రుసుమును రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. భారత కాలమానం ప్రకారం (IST) 2026, జూన్ 8వ తేదీ (సోమవారం) రాత్రి 11:00 గంటలకు ఈ చారిత్రాత్మక తీర్పును బోస్టన్ (మాసచుసెట్స్) ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్డి లియో సోరోకిన్ వెలువరించారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఈ లక్ష డాలర్ల రుసుము చట్ట విరుద్ధమైన పన్ను (Unlawful Tax) అని, పార్లమెంట్ (అమెరికా కాంగ్రెస్) అనుమతి లేకుండా కేవలం అధ్యక్షుడి ఆదేశాలతో ఇలాంటి పన్నులు విధించడానికి వీల్లేదని న్యాయమూర్తి తన 42 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. అమెరికాలోని 20 డెమొక్రాటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన సంయుక్త పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా తక్షణమే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది రిర.

H1b-Visa-Fee-Cancelled : రిపబ్లికన్లు సైతం…

H1b-Visa-Fee-Cancelled

H-1B వీసా దరఖాస్తులపై విధించిన 1,00,000 డాలర్ల రుసుమును రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొందరు రిపబ్లికన్లతో సహా అమెరికా చట్టసభ సభ్యులు స్వాగతించారు; అయితే, ఈ నిర్ణయాన్ని వైట్ హౌస్ అప్పీల్ కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.

H1b-Visa-Fee-Cancelled : హమ్మయ్యా … భారత టెకీలు

H1b-Visa-Fee-Cancelled

అమెరికా ఇచ్చే మొత్తం H-1B వీసాల్లో దాదాపు 75% శాతం వీసాలు భారతీయ ఐటీ నిపుణులు, యువతకే లభిస్తాయి. అందువల్ల ఈ 1,00,000 డాలర్ల అదనపు భారం వల్ల భారతీయ యువతే అత్యధికంగా ఇబ్బంది పడ్డారు. భారత్ తర్వాత అమెరికా టెక్ రంగంలో ఉద్యోగాలు పొందే చైనా యువత కూడా ఈ నిర్ణయంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ఫీజు భరించగలిగినప్పటికీ, భారతీయ యువతను ఎక్కువగా నమ్ముకునే మధ్యస్థాయి ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీలు ఈ భారీ ఫీజు భరించలేక కొత్త నియామకాలను, ఆఫర్లను రద్దు చేసుకున్నాయి.

H1b-Visa-Fee-Cancelled : జనరల్​ అప్లికేషన్లు డల్​

H1b-Visa-Fee-Cancelled

ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ లక్ష డాలర్ల విధానం రెండు రకాలుగా పనిచేసింది. సాధారణ ప్రక్రియలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య విపరీతంగా పడిపోగా, అత్యవసర ప్రాసెసింగ్ కోసం కొందరు భారీగా ఖర్చు చేశారు. సాధారణంగా ప్రతి ఏటా H-1B వీసాల వార్షిక కోటా 85,000 వీసాలు కాగా.. ఏటా లక్షలాది దరఖాస్తులు వస్తుంటాయి ఈ $100,000 రుసుము అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త దరఖాస్తుల సంఖ్య ఘోరంగా పడిపోయింది. ప్రభుత్వ కోర్టు ఫైలింగ్స్ ప్రకారం, ఫిబ్రవరి 15 నాటికి కేవలం 85 మంది మాత్రమే ఈ $100,000 ఫీజు చెల్లించి కొత్త అప్లికేషన్లు దాఖలు చేశారు. సాధారణ కొత్త దరఖాస్తుల వెల్లువ దాదాపు శూన్యానికి పడిపోయింది.

H1b-Visa-Fee-Cancelled : ప్రీమియంతో ఖజానా గలగల

H1b-Visa-Fee-Cancelled

మరోవైపు, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో వీసా ప్రాసెసింగ్‌ను కేవలం 15 రోజుల్లో వేగవంతం చేసుకోవడం కోసం 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ఒక్కొక్కరు $100,000 చొప్పున చెల్లించడానికి సిద్ధపడ్డారు. సాధారణంగా 7.5 నెలలు పట్టే సమయాన్ని తగ్గించుకునేందుకు పెద్ద కంపెనీలు ఈ మొత్తాన్ని చెల్లించాయి.

H1b-Visa-Fee-Cancelled : మధ్యతరగతికి కాస్త ఊరటే

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ చట్టాలను మార్చే లేదా పన్నులు విధించే అధికారం కేవలం పార్లమెంటుకు (కాంగ్రెస్‌కు) మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడు ట్రంప్ తన పరిధిని దాటి ఈ రుసుమును విధించారని, ఇది జరిమానా కాదు.. చట్టవిరుద్ధమైన పన్ను అని కోర్టు తేల్చింది.ముందున్న సవాలు: గతంలో వాషింగ్టన్ డీసీలోని డిస్ట్రిక్ట్ కోర్టు ఈ ఫీజును సమర్థించగా, ఇప్పుడు బోస్టన్ ఫెడరల్ కోర్టు దీనిని రద్దు చేసింది. రెండు వేర్వేరు కోర్టుల నుంచి భిన్నమైన తీర్పులు రావడంతో వైట్ హౌస్ దీనిపై ఉన్నత అప్పీల్ కోర్టుకు వెళ్లనుంది. అప్పీల్ కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు లేదా స్టే విధించే వరకు ప్రస్తుతానికి ఈ లక్ష డాలర్ల ఫీజు రద్దు నిర్ణయం నిపుణులకు పెద్ద ఉపశమనంగా నిలుస్తుంది

ALSO READ : Iran-Israel Conflict Reaches Dangerous Stage-0806-ప్రమాదకర దశలో ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణ.. యుద్ధ భయం పెరుగుతోంది..