చెన్నూరులో ఘనంగా ఎల్లమ్మ బోనాలు
చెన్నూరులో ఘనంగా ఎల్లమ్మ బోనాలు
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పంచ క్రొషా ఉత్తవారావాహిని గోదావరి తీరంలో కొలువుదిరిన రేణుక ఎల్లమ్మ బోనాల వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో కనుల పండువగా సాగింది.
గౌడకులస్తుల అర్థ్యదైవమైన రేణుక ఎల్లమ్మ బోనాల వేడుక ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న మహిళా భక్తులు దూప, దీపలతో పాటు బోనలు నైవేద్యలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
