ఓదెల మల్లన్నను దర్శించుకున్న జాయింట్ సెక్రెటరీ

ఓదెల, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామిని కేంద్ర గ్రామీణ అభివృద్ధి భూ వనరుల శాఖ జాయింట్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి దర్శించుకున్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి కి స్వామి వారి ప్రసాదాలు అందించి సత్కరించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలియజేశారు.