Davos | యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

Davos | యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

Davos | ఆంద్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. యూఏఈ ఆర్థిక మంత్రి అల్‌ మార్రీతో భేటీ అయ్యారు. మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ (park) ఏర్పాటు, ఏపీ-యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్య బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో యూఏఈతో కలిసి పనిచేసేందుకు అంగీకారం కుదిరింది. యూఏఈకి చెందిన 40 సంస్థలు ఏపీలో ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని అల్‌ మార్రీ పేర్కొన్నారు. ఆహార భద్రత, లాజిస్టిక్స్‌, పోర్ట్‌ ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది.

Leave a Reply