ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి…

ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి…

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : ప్రముఖ పత్రిక యజమాని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలను కించపరుస్తూ చేసిన అమర్యాదకర వ్యాఖ్యలను చిలకలూరిపేట నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ప్రముఖ పత్రికలో వైయస్ఆర్ సీపీ నేతల కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని ప్రసారం చేసిన, ప్రచురించిన రాతలు, పాత్రికేయ ధర్మానికి, సామాజిక నైతికతకు విరుద్ధమని పేర్కొన్నారు.

మహిళల గౌరవాన్ని తుంచే విధంగా రాయడం అసహ్యకరమని విమర్శిస్తూ, ప్రముఖ పత్రిక యజమాని వెంటనే తన జుగుప్సాకర వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజాస్వామ్యానికి, మహిళా గౌరవానికి క్షమాపణ చెప్పాలని కోరారు. మహిళల గౌరవం కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని పేర్కొంటూ, ఇలాంటివి మళ్లీ జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

మాజీ మంత్రి విడదల రజిని ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నాయకులు స్థానిక చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ పత్రిక యజమానిపై ఫిర్యాదు చేసి, ఆయనపై కేసు నమోదు చేసి తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply