స్వయం ఉపాధిపై యువత దృష్టి పెట్టాలి
స్వయం ఉపాధిపై యువత దృష్టి పెట్టాలి
- సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్
కడెం, ఆంధ్రప్రభ : నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని పెద్దూర్–కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రం కడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ పీఓపీ షాపును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, జీపీ వార్డు సభ్యులు, నాయకులు ఇస్లావత్ మోహన్ నాయక్, సయ్యద్ హాశం, జి. రాజన్న, గట్ల రమేష్, జాలిగామ నరసయ్య, శేఖర్ గౌడ్, అంజన్న, షాపు నిర్వాహకులు చింతకుంట రాము, గ్రామస్తులు పాల్గొన్నారు.
