పదిలో మెరిసిన కవలలు..
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి గ్రామానికి చెందిన కవలలు సోదరీమణులు పదవ తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచారు.ప్రభుత్వ ఉపాధ్యాయులు గొట్టిముక్కల మోహన్‌రెడ్డి-కవిత దంపతుల కుమార్తెలైన హర్షిత 584/600,హాసిని 581/600 మార్కులు సాధించి మెరిశారు.చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి, క్రమశిక్షణతో సాధన చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తల్లిదండ్రులు తెలిపారు.కవలలు ఇద్దరూ సమానంగా మెరుగైన మార్కులు సాధించడం విశేషం.ఈ సందర్భంగా వారిని ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు స్థానికులు వారిని అభినందించారు.భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
