Chennai | 300 కొత్త బస్సులకు పచ్చజెండా
- బస్సులో ప్రయాణిస్తూ వీడియోలు తీసిన సీఎం
Chennai | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురువారం చెన్నై సచివాలయం వద్ద 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కొత్త బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

బస్సుల ప్రారంభోత్సవం అనంతరం విజయ్ స్వయంగా ఓ ఆర్టీసీ బస్సు ఎక్కి కొంతదూరం ప్రయాణించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులతో ముచ్చటించడంతో పాటు తన సెల్‌ఫోన్‌లో వీడియోలు చిత్రీకరిస్తూ కనిపించారు. ఆయన నిరాడంబరంగా బస్సులో ప్రయాణించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
ఈ దృశ్యాలను పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. విజయ్ సాధారణ ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించిన తీరుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
