పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- మెడికల్ ఆఫీసర్ అజయ్ పవర్ సూచన
భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈనెల 28 ఆదివారం జరిగే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రభుత్వ వైద్యుడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ కోరారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ అజయ్ పవర్ మీడియాతో మాట్లాడుతూ, భీమ్‌గల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల వారు పుట్టిన పిల్లల నుండి ఐదేళ్లలోపు పిల్లలకు రెండు చుక్కల పోలియో మందు వేయించాలన్నారు.మున్సిపాలిటీ, గ్రామాలలోని 42 బూత్‌లలో ఉదయం 7:30 నుండి మందు అందుబాటులో ఉంటుందని తెలిపారు.తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు పోలియో రాకుండా, వైకల్యంలో మార్పు వచ్చి వారు వికలాంగులుగా మారకుండా కాపాడుకోవడానికి ఈ పోలియో చుక్కలు వేయించడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
