మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి..

హనుమకొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో మండుతున్న ఎండల కారణంగా ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రయాణికులు చలివేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. మండుటెండలో ప్రయాణాలు సురక్షితం కాదని, వడదెబ్బ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర ఎండలతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ నీరు తాగాలని, అత్యవసరమైతే తప్ప ఎండలో సంచరించవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply