EXAM | ఫీజు చెల్లింపు గ‌డువు ఆఖ‌రు ఎప్పుడంటే?

EXAM | ఫీజు చెల్లింపు గ‌డువు ఆఖ‌రు ఎప్పుడంటే?

ప‌ది పరీక్షలకు ఫీజు తేదీలు ప్రకటించిన ప్రభుత్వం పరీక్షల కమిషనర్
అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 6వ తేది లోపు…

EXAM | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్, రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎస్సెస్సీ, ఓఎస్సెస్సీ, వొకేషనల్ పబ్లిక్ పరీక్షల కోసం ఫీజు వివరాలను పరీక్షల డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఉత్తర్వులు ఆర్‌సీ నెం.. జిఈ. ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, ఓఎస్ఎస్సి, ఒకేషనల్ /డి డి/2025/డి జిఈ మేరకు శనివారం జారీ చేశారు.

ఫీజు చివరి తేదీలు…

  • లేట్ ఫీజు లేకుండా నవంబర్ 17, నుండి డిసెంబర్ 6 వ తేది లోపు చెల్లించాలి
  • 50 రూపాయల లేట్ ఫీజుతో డిసెంబర్ 7 వ తేది నుంచి డిసెంబర్ 9వ తేది లోపు..
  • 200 రూపాయల లేట్ ఫీజుతో డిసెంబర్ 10వ తేది నుండి డిసెంబర్ 12వ తేది లోపు..
  • 500 రూపాయల లేట్ ఫీజుతో డిసెంబర్ 13వ తేది నుండి డిసెంబర్ 15వ తేది లోపు చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పరీక్ష ఫీజు వివరాలు
అన్ని సబ్జెక్టులు రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాలన్నారు.
3 సబ్జెక్టుల కంటే ఎక్కువ సబ్జెక్టులు: రూ. 125
3 సబ్జెక్టుల వరకు: రూ. 110
వొకేషనల్ విద్యార్థులు: అదనంగా రూ. 60
వయస్సు తక్కువగా ఉన్న విద్యార్థులు: రూ.300
మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం (అవసరమైతే): రూ.80

నిర్దేశాలు ఇలా ఉన్నాయి

  • అన్ని చెల్లింపులు ఆన్లైన్లో www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలన్నారు.
  • నామినల్ రోల్స్ యొక్క మాన్యువల్ సమర్పణ అవసరం లేదన్నారు.
  • తేదీలకు ముందే ఫీజును చెల్లించడం ద్వారా, చివరి సమయాల్లో సర్వర్ ట్రాఫిక్ సమస్యలను నివారించవచ్చుఅన్నారు.
  • ఫీజు గడువు తేదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబడవు అని ఆదేశాల జారీ అయ్యా యి.ఎస్ఎస్సి ఫీ పేమెంట్ కు www.bse.ap.gov.in లో టైల్స్ ఓపెన్ అగు చున్నది.
  • యూసర్ నేమ్: స్కూల్ ఎస్ఎస్సి కోడ్.
  • ఇన్నిటిల్ పాస్ వార్డు: ఎస్ఎస్సి కోడ్ చివర@.
  • చేంజ్ పాస్ వర్డ్ తప్పని సరి.
  • యు డైస్‌లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసి స్టూడెంట్, పేరెంట్స్, హెడ్ మాస్టర్ సైన్ చేసిన తర్వాత స్కాన్ కాపీ బోర్డు ఆఫ్ సెకండరీ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
  • ఆ తర్వాత కన్‌ఫ‌ర్మ్ చేసుకొని ఫీజు పే చేయాలన్నారు.
  • యు డైస్ లో సబ్మిట్ చేసిన తర్వాత యు డైస్‌లో మాత్రమే ఎన్ని సార్లైనా ఎడిట్ చేసుకొని రీ సబ్మిట్ చేసే అవకాశముందన్నారు. కానీ ఎస్ఎస్సి పోర్టల్ లో లేదన్నారు. యు డైస్‌లో స్టూడెంట్ డేటా ఎప్పటికప్పుడు ఎస్ఎస్సి పోర్టల్‌లో హెచ్ఎం లాగిన్ లోకి క్యారీ ఫార్వర్డ్ /రిఫలెక్ట్ అవుతుందన్నారు.
  • ఒకటికి రెండు సార్లు అప్లికేషన్‌లోని డేటాను వెరిఫై చేసుకొని సిగ్నెడ్ స్కాన్ కాపీ అప్లోడ్ చేసుకోవాలన్నారు.

పెనాల్టీ లేకుండా..

  • ఫీజ్‌ పే చేసిన తర్వాత ఎడిట్ అవకాశం ఉండదన్నారు. కనుక, ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్‌, పేరెంట్స్ ఫుల్ నేమ్స్ విత్ సర్ నేమ్స్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, లాంగ్వేజస్, జనరల్ సబ్జెక్ట్స్, డేట్‌ ఆఫ్ బర్త్ ఒకటికి రెండుసార్లు, మూడు సార్లు వెరిఫై చేసుకోవాలని సూచించారు .
  • ఫీ పేమెంట్ కు హడావుడి పడవద్దన్నారు.
  • విద్యార్థుల సమాచారం అంతా కరెక్టుగా ఉన్న తరువాత మాత్రమే ఫీ పేమెంట్ చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి జాగ్రత్తగా దరఖాస్తులు తప్పులు లేకుండా పూరించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ లకు పవిత్ర శాఖ అధికారులకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం విశేషం.

Leave a Reply