Whatsapp | ప్రధానిపై దూషణలు
Whatsapp | ప్రధానిపై దూషణలు
- పోలీసులకు మోడీ అభిమానుల ఫిర్యాదు
Whatsapp | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులో ఆ వ్యక్తి ప్రధానిపై వ్యక్తిగత దూషణలు చేయడం అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగించి తీవ్రమైన దూషణలకు దిగడంపై మండిపడ్డారు. దేశ ప్రధానిపై ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అతనిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ అభిమానులు మక్తల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
