Vijayawada | భక్తుల కోసం..

Vijayawada | భక్తుల కోసం..

  • సంతృప్తికరంగా సామాన్య భక్తులకు అమ్మ దర్శనం..
  • దేవాలయంలో అన్ని మౌలిక సదుపాయాలు..
  • సరవేగంగా మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు..
  • పుష్కరాల నిర్వహణ ఆలయ అభివృద్ధిపై సీఎం దృష్టికి వినతులు..
  • పుష్కరాల సమయానికి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు..

Vijayawada, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ.. వారికి సంతృప్తికర అమ్మవారి దర్శనం భాగ్యం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాద్ పేర్కొన్నారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ (Vijayawada Kanaka Durgamma) ఆల‌యంలో జరుగుతున్న పనులు, భవాని దీక్షల ఏర్పాట్లపై ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌, ఆల‌య ఈవో శీనా నాయ‌క్, ఆల‌య చైర్మ‌న్ బొర్రా రాధ‌కృష్ణ (గాంధీ), ప‌శ్చిమ నియోక‌వ‌ర్గ ఎమ్మెల్యే కార్యాల‌యం కార్య‌ద‌ర్శి ప్ర‌త్తిపాటి శ్రీధ‌ర్, ఇంజ‌నీరింగ్ అధికారులు, బోర్డ్ స‌భ్యుల‌తో క‌లిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2028లో కృష్ణాన‌దికి రాబోయే పుష్క‌రాల సంద‌ర్భంగా క‌నక‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. క‌నక‌దుర్గ‌మ్మ ఆల‌యంలో భ‌క్తుల సౌకార్య‌ర్ధం వెయిటింగ్ హాల్స్ నిర్మించనున్నామని, వెయిటింగ్ హాల్స్ అందుబాటులోకి వ‌స్తే.. భ‌క్తుల‌కు, వృద్దాల‌కు ఎంతో సౌక‌ర్యంగా వుంటుందన్నారు. దేవ‌దాయశాఖ ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రిల‌తో క‌లిసి పుష్క‌రాల నిర్వ‌హ‌ణ‌, ఆల‌య అభివృద్ది పై స‌మావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ పనులను పరిశీలిస్తున్నామన్నారు.

పుష్క‌రాల నిర్వ‌హ‌ణ, ఆల‌య‌ అభివృద్ది ప‌నుల గురించి సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్లామన్న ఆయన, మంత్రి నారాయ‌ణ రెడ్డి, ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రితో క‌లిసి ప‌నులు వేగంగా జ‌రిగేలా కృషి చేస్తామన్నారు. పుష్క‌రాల స‌మ‌యానికి భ‌క్తుల‌కు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామన్నారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి జరిగే భవాని దీక్షల విరమణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయని అలాగే మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు కూడా సరే వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

Leave a Reply