ఆదివాసీ గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
ఆదివాసీ గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
- ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
పెంబి, ఆంధ్రప్రభ : ఆదివాసీ గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్ని
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మారుమూల గిరిజన గ్రమలైన కొలంగూడ, గుమ్మన ఎంగ్లాపూర్, దొందరి, సకిరేవు గ్రమలలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డి ఆఫ్ ఓ సుశాంత్ సుక్ దేవ్ బోబుడే మరియు జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. ఆదివాసీ ప్రజలు పెంబి అటవీ శాఖ కార్యాలయం ముందు 12రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్య లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం తో నిరసన కార్యక్రమం లు ఆదివాసీ ప్రజలు ఆపారు.
ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్య లను పరిష్కరించే విదంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివాసీ గ్రామాలకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డి ఆఫ్ ఓ లను జిల్లా అధికారులను తీసుకెళ్లారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రాకపోవడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో స్టీల్ బ్రిడ్జ్ లను, బి ఎస్ యన్ యల్ టవర్ ఏర్పాటు, సోలార్ లతో పంపు సెట్ లను, మిషన్ భగీరథ నీళ్ల ను ఇస్తామని హామీ ఇచ్చారు.ఆదివాసీ గిరిజనులకు మౌలిక కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం అన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.
అటవీ సమస్య లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఉన్నత స్థాయి అధికారులకు ఆదేశాలను జారీ చేస్తారు. సమస్య లను గుర్తించి పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో పి డి విజయలక్ష్మి, డి పి ఓ రమేష్,డి ఏం హెచ్ ఓ రాజేందర్, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, ఏ ఓ నవీన్, వెట్నారీ డాక్టర్ విజయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడిసె రమేష్, నాయకులు స్వప్నిల్, అర్జున్, శంకర్, స్వామి, గంగాధర్, భూమేష్, నాను, రాజు, అదిల్ అధికారులు, ప్రజలు పాల్గున్నారు.
