స్మశానవాటిక రహదారి మరమ్మతుకు రూ.20 లక్షలు మంజూరు

స్మశానవాటిక రహదారి మరమ్మతుకు రూ.20 లక్షలు మంజూరు

  • విలేకరుల సమావేశంలో వెల్లడించిన నాయకులు

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి స్మశాన వాటిక రహదారి మరమ్మతు చేపట్టేందుకు మంత్రి వాకిటి శ్రీహరి రూ 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఊట్కూర్ మాజీ జడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కోటి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మంజూరుచేసిననిధులప్రొసీడింగ్ చూపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలం స్మశాన వాటికకు వెళ్లేందుకు వివిధ కాలనీలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గత 30 ఏళ్ల నుండి స్మశాన వాటిక రహదారి గుంతలమయంగా దట్టమైన ముళ్ళ పొదలు రోడ్డుకు ఇరువైపులా ఉండడంతో శవాన్ని తీసుకునేందుకుపడరానిపాట్లు పడ్డారనిఅన్నారు. రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దృష్టికి స్మశాన వాటిక దుస్థితి వివరించడంతో స్పందించి 20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. నిధులు మంజూరు కావడంతో స్మశాన వాటిక రహదారి మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రహదారుల మరమ్మతుకు నిధులు మంజూరు చేస్తున్నారని ప్రజాపాలన అభివృద్ధికినిదర్శనం అన్నారు. స్మశాన వాటిక రోడ్డు మరమ్మతుకు నిధులు మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి నిధులు విడుదల చేయడంతో పాతపేట, భరత్ నగర్, కుర్వవీధి, శ్రీకృష్ణ నగర్ ప్రజలుహర్షంవ్యక్తం చేస్తున్నట్లుతెలిపారు. విలేకరుల సమావేశంలోఊట్కూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అధ్యక్షులు లింగం,మాజీ ఎంపీటీసీ గోవిందప్ప వార్డు సభ్యులు సందపురంసువర్ణరవికుమార్, మల్లేష్, అనిల్, నాయకులు కార్యకర్తలు ఖుర్షీద్, జమీర్అలీ, బసిరెడ్డి అశోక్ అర్ఫాత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply