డాక్టర్ కంభం వెంకట్ రాజ్‌కు ఘన నివాళులు..
మేడ్చల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంభం వెంకట్ రాజ్ భౌతికకాయానికి పలువురు రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు ఘన నివాళులర్పించారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పూడూరు గ్రామంలో గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంచిన వెంకట్ రాజ్ మృతదేహాన్ని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ముదిరాజ్ ,కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు వెంకట్ రాజ్ భౌతికకాయంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సామాజిక, రాజకీయ సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపాన్ని తెలియజేస్తూ వారికి ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు..
