ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం….

ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం….

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శాంతినగర్, బిర్సాయి పేట్ గ్రామాల లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. వెయిట్ మెషిన్ పై వరి ధాన్యాన్ని నాణ్యత చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా, మహిళా సంఘాల ద్వారా అనేక ప్రభుత్వ సంక్షేమ పతకాలను అందిస్తున్నాం అని ,ఐకేపీ ఆధ్వర్యంలో వివో సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం అన్నారు.

రైతులకు గిట్టుబాటు ధరకే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ డిసిసి ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాధాబాయి, లక్కారం మాజీ సర్పంచ్ మరసుకోల తిరుపతి, ఐకెపి ఎపిడి గోవిందరావు, డిపిఎం మల్లేష్, ఐకెపి సిసిలు నరసయ్య, సంతోష్, కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి మహేందర్, వివో సంఘాల మహిళా నాయకులు , ఐకేపీ ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply